సమాజానికి బీసీలే వెన్నుముక.
జయహో బీసీ నినాదం కాదు టిడిపి విధానం.
బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి టిడిపి చారిత్రాత్మక కృషి.
బీసీల రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్రలు.
స్థానిక సంస్థల్లో తొలిసారి బీసీలకు రిజర్వేషన్ కల్పించింది అన్న ఎన్టీఆర్.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా స్థానాలు
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
సూర్య న్యూస్ దర్శి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ, బీసీలకు రాజకీయంగా న్యాయం చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు అవకాశం లేని పరిస్థితుల్లోనూ, పార్టీపరంగా 34 శాతం పైగా టికెట్లు కేటాయించి బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించారు.
*బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి టీడీపీ చారిత్రక కృషి*
బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 1995లో వాటిని 34 శాతానికి పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని పేర్కొన్నారు. బీసీలను కేవలం ఓటర్లుగా చూడకుండా, ప్రజాప్రతినిధులుగా, నాయకత్వ స్థానాల్లో నిలబెట్టేందుకు పార్టీ నిరంతరం కృషి చేసిందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోనూ బీసీల సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యం కొనసాగుతోందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని, వారి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
*బీసీల రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు*
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యానికి విఘాతం కలిగించారని వైసీపీపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ విమర్శలు గుప్పించారు. బీసీలు రాజకీయంగా ఎదగకూడదన్న దురుద్దేశంతోనే జగన్ అండ్ కో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీసీల సంక్షేమం పేరుతో ప్రకటనలు చేయడం, ఎన్నికల వేళ వారి ఓట్లను పొందడం తప్ప, రాజకీయంగా వారికి బలమైన ప్రాతినిధ్యం కల్పించడంలో వైసీపీ విఫలమైందని విమర్శించారు. బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే ఆ పార్టీ రాజకీయమైతే, వారికి అవకాశాలు కల్పించి నాయకత్వాన్ని పెంపొందించడం టీడీపీ విధానమని పేర్కొన్నారు.
బీసీలకు న్యాయం చేయాలన్న తమ సంకల్పాన్ని రాజకీయ అడ్డంకులు దెబ్బతీయలేవని గొట్టిపాటి లక్ష్మీ స్పష్టం చేశారు. న్యాయస్థానాల నిర్ణయాలను గౌరవిస్తూనే, బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అనుసరిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల అమలులో ఎదురైన న్యాయపరమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీపరంగా 34 శాతం పైగా టికెట్లు కేటాయించే దిశగా కట్టుబడి పనిచేస్తామని పునరుద్ఘాటించారు.