BREAKING
*గుండెపోటుతో మాజీ ఎంపిటిసి సభ్యులు కొత్త పాండుగౌడ్ మృతి* గ్లోబల్ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో బంగారం ధర ఎందుకు తగ్గలేదు? ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిని తిరస్కరించిన డానా వైట్ గొట్టిపాటి లక్ష్మి నాయకత్వం పై ప్రజల విశ్వాసం ఎంపీటీసీ' పోస్టుమార్టం! పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం గంటలో రూ.8 కోట్లు కాజేసిన కేటుగాళ్లు టీడీపీకి హెచ్చరిక.. వైసీపీకి ఊరట..! హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు

Select Suryaa Now
నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు

*నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు*

*అభివృద్ధి పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలిఖమ్మం బాలాజీనగర్‌లో రూ. 90 లక్షల సుడా నిధులతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*ఖమ్మం నగరంలో ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

శుక్రవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్ బాలాజీనగర్‌లో సుడా నిధులు రూ. 90 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* నగరంలో రోడ్ల విస్తరణ పనులను ప్రజలను ఒప్పిస్తూ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు అంగీకరించని చోట బలవంతంగా పనులు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నగరంలో చేపట్టే అభివృద్ధి పనులన్నీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, అవి దీర్ఘకాలం మన్నికగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మౌళిక సదుపాయాల నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం సూర్య బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ