విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది
విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వాలని భారాస నేత గిరిబాబు డిమాండ్వ్య వసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని వైరా నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తరచూ విద్యుత్ కోతలు,లో వొల్టేజ్ సమస్యలతొ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,సాగునీరు అందక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని,వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గిరిబాబు పేర్కొన్నారు.సకాలంలో విద్యుత్ అందక వ్యవసాయ మోటార్లు పనిచేయకపోవడంతో పంటలకు నీరందడం లేదన్నారు.రాత్రివేళల్లోనూ విద్యుత్ కోసం రైతులు పొలాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని గిరిబాబు గుర్తుచేశారు.ప్రస్తుతం విద్యుత్ కోతల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని సూచించారు.రైతులకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసి,వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వల్ల వ్యవసాయ మోటార్లు,ఇతర విద్యుత్ పరికరాలు దెబ్బతిని రైతులపై అదనపు ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు సాగునీటి సమస్యలను పరిష్కరించి పంటలను కాపాడాలని లకావత్ గిరిబాబు కోరారు.రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని లకావత్ గిరిబాబు స్పష్టం చేశారు.
సూర్య ప్రతినిధి సిద్ధిక్ జూలూరుపాడు