BREAKING
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి *విద్యార్థులు క్రమశిక్షణతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి* జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలోగా పరిష్కారం :మంత్రి పొంగులేటి గ్రేడ్‌- పురపాలక సంఘంగా గూడూరు రూపాంతరం ,పుట్ల గట్ల గూడెం దేవలిపల్లి పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం. ప్రజల విశ్వాసాన్ని ఈసీ కోల్పోతోంది హరీశ్ రావు మంత్రి గొట్టిపాటి చొరవతో నిషేధిత జాబితా నుంచి తొలగింపు. పెద్ద చెరువు భూముల భూసేకరణ నిలిపివేయాలి, రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రులకు పటిష్ట పోలీసు బందోబస్తు

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం...

Select Suryaa Now
గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం...

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం...

 నంగునూరు:-గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నంగునూరు ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
మండల కేంద్రమైన నంగునూరులోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల వార్డు సభ్యులకు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు ఎంపీడీవో శ్రీనివాస్ చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, వార్డు సభ్యులు తమ తమ గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు, ఉప సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల శ్రీధర్ గౌడ్ వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.