BREAKING
గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి *విద్యార్థులు క్రమశిక్షణతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి* జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెలలోగా పరిష్కారం :మంత్రి పొంగులేటి గ్రేడ్‌- పురపాలక సంఘంగా గూడూరు రూపాంతరం ,పుట్ల గట్ల గూడెం దేవలిపల్లి పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం. ప్రజల విశ్వాసాన్ని ఈసీ కోల్పోతోంది హరీశ్ రావు మంత్రి గొట్టిపాటి చొరవతో నిషేధిత జాబితా నుంచి తొలగింపు. పెద్ద చెరువు భూముల భూసేకరణ నిలిపివేయాలి, రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రులకు పటిష్ట పోలీసు బందోబస్తు

శ్రీవాణి స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
శ్రీవాణి స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

శ్రీవాణి స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ముఖ్య అతిథులుగా తన్నీరు హరీశ్ రావు, చైర్మన్ మంజుల రాజనర్సు, న్యాయవాది యాసల వెంకట్ లింగం

సిద్దిపేట అర్బన్  :సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్‌లో ఉన్న శ్రీవాణి స్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయినులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన్నీరు హరీశ్ రావు, చైర్మన్ మంజుల రాజనర్సు, న్యాయవాది యాసల వెంకట్ లింగం హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సీహెచ్ సత్యం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వివరించారు.

విద్యార్థులకు చిన్ననాటి నుంచే మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు, వాటి పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఇలాంటి వేడుకల ప్రధాన ఉద్దేశమని సత్యం పేర్కొన్నారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పాఠశాల చివరి రోజు వేడుకలు బతుకమ్మ సంబరాల మధ్య ఉల్లాసంగా ముగిశాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.