కోర్టు ఆదేశాలతో తిరిగి బాధ్యతలు స్వీకరించనున్న ఎత్తం సర్పంచ్, ఉపసర్పంచ్ *కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేసిన కోర్టు *న్యాయం గెలిచిందంటూ ఎత్తం సర్పంచ్ ఉప సర్పంచ్ హర్షం
కోడేరు మండల పరిధిలోని ఎత్తం గ్రామానికి చెందిన సర్పంచ్ బొలెమోని లక్ష్మి మరియు ఉపసర్పంచ్ బోలమోని ధర్మరాజు గత నెల సెప్టెంబర్ 15న నిధుల దుర్వినియోగంపై సస్పెండ్ కు గురయ్యారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమపై నిధుల దుర్వినియోగం మోపడం అన్యాయ మని న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ గోడును వెల్లబోసుకున్నారు. అట్టి నిధుల దుర్వినియోగం పై న్యాయస్థానం పూర్తి విచారణ చేపట్టింది. దీంతో న్యాయస్థానం చేపట్టిన విచారణ అభివృద్ధి పనులపై ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని న్యాయస్థానం ద్వారా తీర్పు వెలు వడడంతో కలెక్టరు సస్పెన్షన్ చేసిన ఉత్తర్వులను కొట్టివేయడం జరిగింది. దీంతో అక్టోబర్ 9న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఎత్తం సర్పంచ్ బోలమోని లక్ష్మి మరియు ఉప సర్పంచ్ బోలమోని ధర్మరాజు బాధ్యతలు స్వీకరించాలని కోర్టు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భంగా వారు తమకు న్యాయం జరిగిందంటూ ఎత్తం సర్పంచ్ బొలెమోని లక్ష్మి, ఉప సర్పంచ్ బొలెమోని ధర్మరాజు హర్షం వ్యక్తం చేశారు.
పరశురాముడు కోడేరు, సూర్య న్యూస్: