శ్రీ నికేతన్ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు
శ్రీ నికేతన్ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కందుకూరు మండలం కొత్తగూడ ఎక్స్‌రోడ్డులోని శ్రీ నికేతన్ హైస్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మట్ట శారద మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పూల పండుగ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్: మేజర్ న్యూస్ కందుకూర్