BREAKING
కోకో మొక్కల ఎదుగుదలపై అవగాహన సామంతపూడి పాఠశాలలో ముందస్తు దసరా వేడుకలు. ఎమ్మెల్యే అమిలినేని ఘనంగా సత్కరించిన ప్రైవేట్ పాఠశాలల సంఘం. శాస్త్రవేత్తలు జాబితాలో అంతర్జాతీయ ఖ్యాతి న్యూజిలాండ్‌ ఉద్యోగం పేరుతో రూ.7.50 లక్షలు స్వాహా… బీజేపీ ఆధ్వర్యంలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమం ఉషశ్రీ శతజయంతికి సహకరిస్తాం డాక్టర్ జంధ్యాల, ఎం.సి. దాస్ తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాసేవలో ముందుంటుంది వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు పెద్దల పండుగకు హిందూ స్మశాన వాటికలో ప్రత్యేక శుభ్రత 25 మంది సిబ్బందితో మూడు రోజులుగా పారిశుద్ధ్య పనులు అంగన్వాడీ కార్యకర్తలకు బిజెపి మహిళ మోర్చా సన్మానం పూల సింగిడి.. బతుకమ్మ సందడి! రెండున్నర ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైళ్ల స్టాపేజీలు

హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్

Select Suryaa Now
హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: శిరోరక్ష--ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని 216 జాతీయ రహదారి వేమవరం కూడలి వద్ద భట్టిప్రోలు ఎస్ ఐ అమీర్ ఆధ్వర్యంలో  హెల్మెట్ ప్రయాణం... సురక్షిత ప్రయాణం పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ అమీర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వలన,యాక్సిడెంట్లు జరిగిన సందర్భంలో ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని, తెలిపారు. మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని ఎస్ ఐ అమీర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. యువత మేల్కొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని, హెల్మెట్ లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అమీర్ హెచ్చరించారు. కార్యక్రమంలో వాహనదారులు, మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.