BREAKING
జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్ నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. ! శ్రీకృష్ణ నామస్మరణతో... మార్మోగిన నాగరగూడ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి వైసిపి నేతలకు రాష్ట్ర జిల్లా స్థాయి పదవులు మైసూర్ దసరా 2026: బంగారు అంబారీ రేసు నుంచి మహేంద్ర తాత్కాలికంగా అవుట్.. పెద్దల అమావాస్య.. తల్లిదండ్రుల సేవపై ఆధ్యాత్మిక సందేశం రోడ్డు విస్తీర్ణ పనులకు పంతొమ్మిది కోట్లు మంజూరు శరన్నవరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

బతుకమ్మ సంబరం.. జేబీఎంలో పూల సందడి!

Select Suryaa Now
బతుకమ్మ సంబరం.. జేబీఎంలో పూల సందడి!

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని జేబీఎం ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. పూల పండుగ వేడుకలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలతో విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాపురం జంగయ్య, కరస్పాండెంట్‌ గంగాపురం నిర్మల ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవి, రంజిత్‌, యువరాజు, జ్యోతి, సుష్మ, మమత తదితరులు పాల్గొన్నారు.