శరన్నవరాత్రి వేడుకలకు ముస్తాబైన ఆలయాలు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
పట్టణంలో జగన్మాత శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. పట్టణంలోని గాయత్రీ దేవి, వాసవీ కన్యకా పరమేశ్వరి, రేణుకా ఎల్లమ్మ, శశీలాంబ దేవి, సుంకులమ్మ, లక్ష్మీ ప్లేగమ్మ తదితర ఆలయాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోనూ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిఎస్పీ శ్రీనివాసులు , సి ఐ కంబగిరి రాముడు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.