రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో (రాజమహేంద్రవరం ) ధవలేశ్వరం కల్వర్టు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతిచెందగా తండ్రి గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ధవలేశ్వరం ఎస్సై కథనం ప్రకారం రావులపాలెం గ్రామానికి చెందిన గుండాలపు గోవిందరాజు విశాఖలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తన కుమార్తె గుండాలపు శాంభవిని (22) తీసుకుని రావులపాలెం నుండి రాజమండ్రి రైల్వే స్టేషన్ కు స్కూటీపై వెళుతుండగా ధవలేశ్వరం కల్వర్టు వద్దకు చేరుకునేసరికి ఆఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ స్కూటీ పై వెళ్తున్న తండ్రి కుమార్తెలను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుండాలకు శాంభవి అక్కడికక్కడే మృతిచెందగా గుండాలకు గోవిందరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. రావులపాలెంలో టైలర్ గా పని చేస్తూ గోవిందరాజు జీవనోపాధి పొందుతుండగా కుమార్తె గుండాలపు శాంభవి రోడ్డు ప్రమాదం లో మృతి చెందడంతో రావులపాలెంలో విషాద చాయలు అల్లుకున్నాయి. ధవలేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంబావి మృత్యాహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.