BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన..

Select Suryaa Now
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన..


- ప్రమాదాల నివారణకు పోలీసు, హైవే అధికారుల సంయుక్త తనిఖీలు..

నరసన్నపేట అక్టోబర్ 10 మేజర్ న్యూస్: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా పోలీసు, హైవే అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. శనివారం సాయంత్రం మడపాం బ్రిడ్జి నుంచి జడూరు జంక్షన్ వరకు జాతీయ రహదారిపై ఉన్న ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్), రహదారి భద్రతా ఏర్పాట్లు, వీధి దీపాలు, సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.నరసన్నపేట సీఐ ఎం. శ్రీనివాసరావు, ఎస్ఐ బి. గణేశ్, హైవే అథారిటీ అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు, రాత్రి వేళల్లో వాహనదారులకు తగిన వెలుతురు అందుబాటులో ఉందా లేదా, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు.రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు, గుర్తించిన లోపాల సవరణపై సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.వాహనదారుల భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడటమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.