BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ

Select Suryaa Now
ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే  తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్   కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ

కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ ఏ గంగిరెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ ప్రతిభతో పాటు క్రమశిక్షణ, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. కళాశాలలో ఉన్న అత్యుత్తమ వసతులను ఉపయోగించుకుని, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా తమ నైపుణ్యాలను తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.కె.చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే చదువుపై దృష్టి పెట్టడంతో పాటు సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, కళాశాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని సంస్థ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాలని ఆకాంక్షించారు.అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు ప్రదర్శించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బోధన, బోదనేతర సిబ్బంది, కోఆర్డినేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి