BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ

Select Suryaa Now
మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి :తెలంగాణ పల్లెల్లో పూల సందడి మొదలైంది. ఆడపడుచుల ఆటపాటలతో బతుకమ్మ సంబురాలకు కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయం వేదికైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీక బతుకమ్మ పండుగ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహిమాన్విత ఆలయంలో తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యాయి. ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, మహిళల ఐక్యతను, కుటుంబ బంధాలను, తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పేలా, తెలంగాణ పల్లె పదాల పాటలతో అక్కాచెల్లెళ్లు, ఆడపడచులంతా ఆడుతూ పాడుతూ ఊర్రూతలూగించారు. భవానీ అమ్మవారి దీక్షలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  ఈ ఎంగిలి బతుకమ్మ వేడుకలను ఆద్యంతం తిలకించారు. బండి సంజయ్ సతీమణి బండి అపర్ణతోపాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఎంగిలి బతుకమ్మ వేడుకల్లో భాగస్వాములు కావడం విశేషం.
 
 
మహిళలను గౌరవించండి.... కుటుంబ బంధాలను కాపాడుకోండి
 
‘‘బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక! మన సంస్కృతికి సజీవ సాక్ష్యం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను తిలకించిన అనంతరం మాట్లాడుతూ... ‘‘ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే ఈ తొమ్మిది రోజుల పండుగ మన సంప్రదాయాలను, మన కుటుంబ బంధాలను గుర్తుచేస్తుంది. మన తంగేడు పూలు.. మన గునుగు పూలు.. మన ఆడపడుచుల ఆటపాటలు.. ఇవన్నీ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.  పూలను పేర్చడంలోనే ఒక అందం ఉంది. కానీ ఆ బతుకమ్మ చుట్టూ మహిళలంతా ఒక్కటిగా చేరడంలో అంతకంటే గొప్ప సందేశం ఉంది. అదే ఐక్యత! అదే ఆత్మీయత. బతుకమ్మ మనకు ప్రకృతిని ప్రేమించడం నేర్పిస్తుంది. చెరువులను కాపాడుకోవాలని గుర్తుచేస్తుంది. మన పండుగలను, మన సంస్కృతిని భావితరాలకు అందించాలని చెబుతుంది. అంతేకాదు, మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలి. మన ఆడపడుచులను గౌరవించాలి. మన సంప్రదాయాలను కాపాడుకోవాలి.  పండుగ అంటే కేవలం సంబరాలు చేసుకోవడం కాదు.. మన కుటుంబాల్లో ఆనందం పంచుకోవడం, మన సమాజంలో ఐక్యతను పెంచుకోవడం.’’అని పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాశక్తి ఆలయంలో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక సాంస్క్రుతిక కార్యక్రమాలు ఉంటాయని, ప్రతిరోజు సాయంత్రం దాండియా సహా భక్తిగీతాలుంటాయని, ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ఆద్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.