BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 సూర్య కరీంనగర్ :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో ఉన్న అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ మైదానంలో అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తన సతీమణి డాక్టర్ వి. వనజా నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థినులు అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జానపద గేయాలకు అనుగుణంగా విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.