BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

సూర్య, సెంటినరీ కాలనీ  :రామగిరి మండలంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ వేడుకల సందర్భంగా పూలు, బతుకమ్మ పువ్వుతో  బతుకమ్మ ను ఏర్పాటు చేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలలో సర్పంచులు  పల్లె ప్రతిమ పీవీరావు(రత్నాపూర్),  కొండవేన దివ్య- సుధాకర్(నాగేపల్లి), రేండ్ల శారద- కుమారస్వామి(కలవచర్ల), కొండ మంజుల- శ్రీనివాస్(చందనాపూర్), పుల్లెల భాగ్యలక్ష్మి-కొమురయ్య(రాజాపూర్), వీరగోని రమాదేవి - శ్రీనివాస్(లొంకకేసారం),రొడ్డ మౌనిక- కుమార్(నవాబుపేట),  తాండ్ర యమున- శ్రీనివాస్(జల్లారం), తదితరులు పాల్గొన్నారు.
కమాన్ పూర్ మండలంలో....
కమాన్ పూర్ మండలం లో గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణలోనే అతి పండుగలో ముఖ్యమైనది బతుకమ్మ వేడుకలు. ఈ వేడుకలు మండల కేంద్రంతో పాటు గుండారం, జూలపల్లి, పేరపల్లి, రొంపికుంట, నాగారం, పెంచికలపేట, సిద్దిపల్లె, కిష్టంపల్లె, రాజాపూర్, లింగాల, గొల్లపల్లి తదితర గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆయా గ్రామాల్లోని చావళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ యాసలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఈ వేడుకల్లో ప్రస్తుత సర్పంచులు పల్లె మాధవి, బంగారు కళ్యాణి, పోల్ దాసరి వనిత, తో పాటు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మల అనంతరం సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.