దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం
మెలియాపుట్టి.మెలియాపుట్టి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు బీజేపీ నాయకుడు డాక్టర్ సలాన శరత్‌కుమార్ రూ.5 వేల విరాళం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలని, ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. జగన్మాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, పాతపట్నం నియోజకవర్గం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి ఆటో యూనియన్ అధ్యక్షుడు మాణికి ధనుంజయ, గడ్డం రవి, ప్రభాకర్, ఈశ్వరరావు, వేణు తదితరులు పాల్గొన్నారు.