BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

Select Suryaa Now
ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ
సూర్య రాజన్న సిరిసిల్ల :తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు నేటి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ వేడుకలను ఆశీర్వ శుక్ల పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులంతా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ.పూలనే పూజించే పండుగకు సిరిసిల్ల పట్టణం సర్వం సిద్ధమైంది పట్టణాల్లో బతుకమ్మ వేడుకలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ వేడుకలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయానికి అద్దం పట్టి బతుకమ్మ పండుగకు వేళయింది.ఈ నెల తొమ్మిది భాద్రపద మాసం అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.ఈసారి ఉత్సవాలను ఘనంగా చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.ఈ బతుకమ్మని తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది.తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా కలకాలం నిలిచిపోయింది. పట్టణంలోని వాడవాడల బతుకమ్మ పాటలతో హోరెత్తుతున్నాయి.చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా ఆడి పాడి గౌరమ్మను పూజిస్తున్నారు.నేటి నుండి దసరా వరకు వేదిక కానున్నది.మహిళలు అత్యంత ఉత్సాహంగా నూతన వస్త్రాలు ధరించి తిరోక్క పూలతో బతుకమ్మను పేర్చి ప్రధాన వీధులలో  పాటల పాడుతూ ఆటలు ఆడారు.అనంతరం ఎంగిలిపూల బతుకమ్మను ఊరేగింపుగా సిరిసిల్ల మానేరు నదికి తరలించి నిమర్జనం చేశారు.సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ మహిళతో కిక్కిరిసిపోయింది.మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు నేటి నుండి ప్రారంభం కావడంతో మున్సిపల్ పాలకవర్గం ఏర్పాట్లలో నిమగ్నమైంది.