శ్రీరామలో మేధో సంపత్తి హక్కులపై అవగాహన
కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఐఐఐటిడియం కర్నూలు వారి ఆధ్వర్యంలో మేధో సంపత్తి హక్కులు, పారిశ్రామికవేత్తల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైదరాబాదుకు చెందిన రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్, పేటెంట్ ఏజెంట్ అశోక్ పాల్గొని పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, మేధో సంపత్తి పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ఆవిష్కర్తలు తమ వినూత్న ఆలోచనలకు చట్టపరమైన రక్షణ పొందడంతో పాటు వాటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలను తెలిపారు. ఆర్ఏఎంపీ పథకం కింద ఎంఎస్ఎంయులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, వ్యాపార అవకాశాలపై పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు అవగాహన కల్పించారు. అనంతరం ముగింపు కార్యక్రమంలో ఐఐఐటిడియంకు చెందిన డాక్టర్ నోయల్ మాట్లాడారు. అవగాహన కార్యక్రమానికి సహకరించిన శ్రీరామ యాజమాన్యానికి, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.ఎన్.వాసు, అకడమిక్ కోఆర్డినేటర్ డా.ఎ.ముని శంకర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ జి. చంద్రశేఖర్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి