BREAKING
రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్! దసరాకైనా "చేయూత" నిచ్చేనా...??

నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి

Select Suryaa Now
నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు  తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్   విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి

 

విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు విద్యార్థులకు నిర్వహించిన సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అకడమిక్ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, బృందంగా పనిచేసే సామర్థ్యం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టీఫికేట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ చెండ్రాయుడు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, ఫిజిక్స్ హెచ్డీ ప్రొఫెసర్ బి దేవప్రసాద్ రాజు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి