శ్రీకృష్ణ నామస్మరణతో... మార్మోగిన నాగరగూడ
షాబాద్ మండలం నాగర్‌గూడ శ్రీకృష్ణ మందిరంలో భజన సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. హరే కృష్ణ, హరే రామ నామజపంతో మందిరం భక్తిమయంగా మారింది. ఈ సందర్భంగా గొల్లపల్లి అంజిరెడ్డి మాట్లాడుతూ... తల్లిదండ్రులను గౌరవించి, వారు జీవించి ఉన్నప్పుడే ప్రేమతో సేవ చేయాలని సూచించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి యువత తెలుసుకోవాలని మార్గదర్శనం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తుల కంటే ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పించాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు భగవద్గీత పారాయణం సత్సంగ కార్యక్రమాలను, భక్తి మార్గాలను వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు రఘునాథరావు బాబా, ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి అంజిరెడ్డి, మందిర నిర్మాణ దాత తాళ్ల శ్రీనివాస్ గౌడ్ భజన భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)