జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన
తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ త్రిశూల్' లో భాగంగా శనివారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో పోలీసు అధికారులు ప్రజలకు నేరుగా కలసి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక ప్రచారం చేపట్టారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతకు కౌన్సెలింగ్ ఇచ్చారు.రోడ్డు భద్రత-నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్ట్ ఆవశ్యకతపై పలు సూచనలు చేశారు. మహిళల రక్షణ చట్టాలు, దిశా యాప్ వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా పల్లెనిద్ర కార్యక్రమాల ద్వారా పోలీసులు గ్రామాల్లోనే బస చేసి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో మాదకద్రవ్యాల నిరోధానికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1972 గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం కీలకంఅన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు సబ్ డివిజన్లో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి