రోడ్డు విస్తీర్ణ పనులకు పంతొమ్మిది కోట్లు మంజూరు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషితో రావులపాలెం, వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే ఏటిగట్టు రహదారి విస్తరణ పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రూ.6 కోట్లతో పాటుగా, పుష్కర నిధులు, ఇతరత్రా నిధులతో కలిపి రూ.8 కోట్లు ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే మంజూరయ్యాయి. నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి రూ.19 కోట్లతో రహదారి విస్తరణ చేపట్టి, అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. దీనితో ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి బాలునాయక్, సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ ఎస్ఈ పి రామకృష్ణారెడ్డి, ఈఈ సీతంనాయుడు, డీఈఈ అన్యం రాంబాబు, అధికారులు శనివారం రహదారిని పరిశీలించారు. ఏపీ ఆర్ ఆర్ ఎస్ పి నిధుల నుంచి జాతీయ రహదారి నుంచి వాడపల్లి కి ఏటిగట్టు రోడ్ మంజూరు,5.5 మీటర్ల వెడల్పున చేయడానికి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు తెలిపారు