వైసిపి నేతలకు రాష్ట్ర జిల్లా స్థాయి పదవులు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్తపేట నియోజకవర్గానికి ప్రాధాన్యం లభించింది.సంస్థాగత బలోపేతంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన పలువురికి రాష్ట్ర,జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఐదుగురికి రాష్ట్ర,జిల్లా స్థాయిలో పదవులకు నియమితులయ్యారు.రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఆత్రేయపురం మండలం పేరవరం కు చెందిన రాయి వెంకటేశ్వరరావు,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం సెక్రటరీగా గంటి గ్రామానికి చెందిన సాగి బంగార్రాజు,రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా అవిడికి చెందిన రెడ్డి వెంకట రామ సుబ్రహ్మణ్యం(రెడ్డి చంటి),రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీగా మోడేకుర్రుకు చెందిన మామిడిశెట్టి ఏడుకొండలు,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధిగా ఆత్రేయపురం మండలం పేరవరం కు చెందిన బెజవాడ వీర వెంకట సత్యనారాయణ మూర్తి ( సతీష్ )కు బాధ్యతలు అప్పగించారు.కొత్తపేట నియోజకవర్గానికి చెందిన నాయకులకు పార్టీ రాష్ట్ర,జిల్లా స్థాయిలో బాధ్యతలు దక్కడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు