నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
నేరేడుచర్ల మేజర్ న్యూస్
నేరేడుచర్ల పట్టణం లో బతుకమ్మ వేడుకలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
బతుకమ్మ వేడుకలలో పుర ప్రజలు వివిధ వార్డుల్లో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర హిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను రంగురంగుల పూలతో అందంగా పేర్చి "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంట పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మకు ప్రత్యేక విశిష్టత ఉందని మహిళలు తెలిపారు. పండుగను పురస్కరించుకొని మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.