పెద్దల అమావాస్య.. తల్లిదండ్రుల సేవపై ఆధ్యాత్మిక సందేశం
పెద్దల అమావాస్య సందర్భంగా షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలో పితృదేవతలను స్మరించుకుంటూ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటూ, వారు జీవించి ఉన్నప్పుడే గౌరవించి సేవ చేయాలని గొల్లపల్లి అంజిరెడ్డి పిలుపునిచ్చారు. పూర్వీకులు అందించిన సంప్రదాయాలను కాపాడుకుంటూ, కుటుంబ విలువలను భావితరాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని పితృదేవతలను స్మరించుకున్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)