BREAKING
2028 బంగారం ధరలపై ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలు ఈ సంవత్ మార్కెట్లు నేర్పిన 10 ప్రధాన పాఠాలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన నూతన నూతన ఎంపీటీసీలు.. సుధాకర్, తిమ్మా నాయుడు రాజస్థాన్ బోర్డ్ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటన వైట్‌హౌస్ నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ని కలసిన జడ్పిటిసి సౌమ్య ఏఐ క్షీణతతో భారత్, చైనా మార్కెట్లకు విదేశీ నిధుల వెల్లువ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత: హోర్ముజ్ వద్ద పేలుళ్లు, అరామ్‌కోపై దాడులు మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు పిలుపు న్యూజిలాండ్ ఎన్నికల్లో మితవాద కూటమి ఆధిక్యం మూడు విడతల్లో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: పూర్తి షెడ్యూల్ విడుదల గచ్చిబౌలి జయభేరి అపార్ట్‌మెంట్‌లో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్

గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్) మండలంలోని గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తొలిరోజే బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం కావడంతో కాలనీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది.

జాన్సన్ డేవిడ్ (బాబు) 
సూర్య రిపోర్టర్ 
చుంచుపల్లి మండలం 
కొత్తగూడెం.