BREAKING
రూపురేఖలు మార్చేలా తుడా మెగా ప్లాన్ -ట్రాఫిక్ ఫ్రీ కారిడార్లు, 100 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్లతో అభివృద్ధి ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష

షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Select Suryaa Now
షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

షాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. షాబాద్ పోలీసులు, చేవెళ్ల జోన్ ఎస్‌ఓటీ బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 13.97 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అక్టోబర్ 9న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నాగర్‌కుంట చౌరస్తా సమీపంలోని టీ-టైమ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి మారమ్ వంశీ రెడ్డి (23), బీరా ప్రవీణ్ కుమార్ (28)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మీర్జాగూడలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందినవారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి డ్రగ్స్‌తో పాటు రెండు రెడ్‌మి మొబైల్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో బెంగళూరుకు చెందిన స్టీఫెన్ వద్ద గ్రాముకు రూ.3 వేల చొప్పున సుమారు 14 గ్రాముల ఎండీఎంఏను రూ.42 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మోకిల, కోకాపేట, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయించేందుకు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పరారీలో ఉన్న స్టీఫెన్ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని సెక్షన్ 8(సి) రెడ్‌విత్ 22(సి) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ విక్రయాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు కోరారు.

షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)