ఉట్లపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఉట్లపల్లిలో ఘనంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు
కందుకూరు మండలంలోని ముచ్చర్ల గ్రామపంచాయతీ పరిధి ఉట్లపల్లిలో ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలను శనివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పసుపు కుంకుమలతో గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు.
అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
టి. శ్రీనివాస్:మేజర్ న్యూస్, కందుకూరు.