గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్) మండలంలోని గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తొలిరోజే బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం కావడంతో కాలనీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది.
జాన్సన్ డేవిడ్ (బాబు)
సూర్య రిపోర్టర్
చుంచుపల్లి మండలం
కొత్తగూడెం.