BREAKING
పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు

అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం

Select Suryaa Now
అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం

 

భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది
-దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.. చింతపల్లి మేజర్ న్యూస్. నల్లగొండ జిల్లా.
చింతపల్లి మండలం మదనాపురం గ్రామంలో డిసెంబర్ 5వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి 18వ మహాపడి పూజ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ .రవీంద్ర కుమార్ కి మహోత్సవ నిర్వాహకులు, మాజీ సర్పంచ్ ఉడుత .అక్రం యాదవ్ స్వామి మర్యాదపూర్వకంగా అందజేశారు.ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్  మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు జీవితంలో క్రమశిక్షణ, సేవాభావం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. అయ్యప్ప స్వామి భక్తి మార్గం క్రమశిక్షణకు, నిష్ఠకు, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, సోదరభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, 18వ మహాపడి పూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల . ప్రవీణ వెంకటరెడ్డి దంపతులను కలిసి పత్రికను అందజేశారు. అయ్యప్ప సన్నిధానం స్వాములు తదితరులు ఉన్నారు.