BREAKING
తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బీజ్ యాప్ ప్రారంభం పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత..

కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం

Select Suryaa Now
కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం

సూర్య తాడ్వాయి: తాడ్వాయి మండలం లోని బ్రహ్మాజీ వాడి గ్రామం రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' నమోదు ప్రక్రియ బ్రహ్మాజీ వాడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద  ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ డాకూరి అంజనీ బాయ్ రఘుపతిరావు  ప్రత్యేక అధికారి  పంచాయతీ కార్యదర్శి మల్లిక మాట్లాడుతూ, కుటుంబంలో సంపాదించే వ్యక్తి అనుకోని విధంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించి అర్హులైన కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా రక్షణ కల్పిస్తోందని వివరించారు.గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబం ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మకుండా నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. అనంతరం పలువురు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, మీసేవ రసీదులను అందజేశారు.ఈ కార్యక్రమంలో  బ్రహ్మాజీవాడి గ్రామ సర్పంచ్ అంజనీ బాయ్ రఘుపతిరావు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లిక, కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ రవీందర్ రావు, ఉపసర్పంచ్  ఘాజీ రాజు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంజయ్య, మండల పార్టీ బీసీ సెల్ నాయకులు అశోక్ రావు, మండల పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు & గడ్డం రాజు,  గ్రామ రేషన్ డీలర్ రాజేందర్ రావు, తాడ్వాయి మండల PACS డైరెక్టర్ రమేష్ రావు, గ్రామ పెద్దలు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.