కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్
పరిగి,మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇంచార్జ్‌గా నియమితులైన బి.ఎం.సందీప్ ను శుక్రవారం హైదరాబాద్‌లో పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (ఎస్ ఐ ఆర్) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆర్ ఆర్ బి.ఎం.సందీప్ ను శాలువాతో సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో మరియు పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం,పార్టీ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, రానున్న రోజుల్లో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ఇరువురు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.