రేపు వికారాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వికారాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న తన నివాసం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి వికారాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.