BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం

Select Suryaa Now
షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం

*ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొని తెలకపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య మృతి*

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఉమ్మి బైపాస్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందురు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఆదివారం రాత్రి 9.45 గంటల సమయంలో షాద్‌నగర్ బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా, సికింద్రాబాద్ నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఏపీ ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్, షాద్ నగర్