BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

ఆల్ఫోర్స్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
ఆల్ఫోర్స్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు

హుస్నాబాద్ ; ఆల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల మధ్య విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. చిన్నారుల ఆటపాటలు, మహిళల కోలాహలంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వుట్కూరి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి పట్ల అవగాహన, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతాయని పేర్కొన్నారు.రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు. ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడంతో పాటు సంప్రదాయ పండుగల విశిష్టతను తెలియజేసేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకల్లో విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.