పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ పరామర్శ..
బెజ్జంకి,; మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామానికి చెందిన మల్లం పోచవ్వ,గడ్డం శివ సాత్విక్,నేదునూరి రామయ్య వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ఆదివారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అధైర్య పడొద్దని భరోసా కల్పించారు.అలాగే ప్రమాదంలో గాయపడిన పబ్బతి నర్సయ్య,సరోజన లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ పరామర్శలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,నాయకులు పర్శ సంతోష్,గుర్రం రాజిరెడ్డి,జెల్ల ప్రభాకర్,ర్యాకం రాజు,రాగుల రవిశంకర్,బిగుల్ల బాబు,రొడ్డ ఐలయ్య,మోహన్,చందు తదితరులు ఉన్నారు.