సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి
సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి
– గుర్రం రాజశేఖర్ రెడ్డి
సిద్దిపేట రూరల్ : గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఐదో వార్డు సభ్యుడు గుర్రం రాజశేఖర్ రెడ్డి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువసేన యూత్ ఆధ్వర్యంలో దేవి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన ఉత్సవాలకు ఆహ్వానం మేరకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకుని, పట్టుచీరతో పాటు పూజా సామగ్రిని సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, సీతారాంపల్లి సిరిసంపదలతో తులతూగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మిట్టపల్లి సుధాకర్,మిట్టపల్లి సందీప్, మిట్టపల్లి స్వామి,మిట్టపల్లి దుబ్బ నవీన్,మిట్టపల్లి దేవరాజ్,మిట్టపల్లి మహేష్, మిట్టపల్లి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్ రమేష్)