టియుడబ్ల్యూజే హెచ్- 143 మండల అధ్యక్షులుగా సిరిపంగి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నిక
గార్ల, మేజర్ న్యూస్, జర్నలిస్ట్ ల సంఘం
నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం మండల కేంద్రంలోని ఆంధ్రజ్యోతి మండల విలేకరి సంపసాల వెంకటరశ్వర్లు నివాసంలో మండల స్థాయి విలేకరుల సమావేశం సీనియర్ జర్నలిస్ట్, జిల్లా కన్వీనర్, నాయకులు మద్దినేని గుట్టయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నిక చేశారు. మండల అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ సిరిపంగి నాగేశ్వరరావు (సూర్య), ప్రధాన కార్యదర్శిగా మాలోత్ సురేష్ (విశాల తెలంగాణ) లు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. టియుడబ్ల్యూజే హెచ్-143 జిల్లా కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ మద్దినేని గుట్టయ్య(విశాల తెలంగాణ) మాట్లాడుతూ.. అరుగలం శ్రమిస్తూ.. ఎన్నో అటుపోట్లు ఎదురుకుంటూ, ప్రాణాలను సహితం లెక్క చేయకుండా, సమగ్ర ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వార్తలు వ్రాస్తూ.. అటు ప్రభుత్వ అధికారులను ఇటు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విలేకరులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలువలన్నారు. వారి కోసం టియుడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఆదివారం స్థానిక సంపసాల వెంకటేశ్వర్లు(ఆంధ్రజ్యోతి) నివాసంలో టియుడబ్ల్యూజే హెచ్-143 గార్ల మండల స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా సిరిపంగి నాగేశ్వరరావు(సూర్య )
ప్రధాన కార్యదర్శి గా మాలోత్ సురేష్(విశాల తెలంగాణ)ఉపాధ్యక్షులుగా సంపసాల వెంకటేశ్వర్లు (ఆంధ్రజ్యోతి ), సహాయ కార్యదర్శులుగా పగడాల రామారావు(నమస్తే ), కొత్తపల్లి రవీందర్ (ప్రభాత గమనం), భానోత్ భద్రు (పయనించే సూర్యుడు) లు కోశాధికారులుగా ఎన్నికయ్యారు. వారితో పాటుగా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ పిల్లల నరసింహారావు,యం కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ నాగేశ్వరరావు, గార్ల, మహబూబాబాద్ జిల్లా