బ్రహ్మగిరి క్షేత్రంలో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి అలంకరణ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో అమ్మవారు తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు.
శరన్నవరాత్రుల ప్రారంభంతో బ్రహ్మగిరి క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పూజలు నిర్వహిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
(చేవెళ్ల, మేజర్ న్యూస్)