BREAKING
ఎమ్మెల్యే అమిలినేని ఘనంగా సత్కరించిన ప్రైవేట్ పాఠశాలల సంఘం. శాస్త్రవేత్తలు జాబితాలో అంతర్జాతీయ ఖ్యాతి న్యూజిలాండ్‌ ఉద్యోగం పేరుతో రూ.7.50 లక్షలు స్వాహా… బీజేపీ ఆధ్వర్యంలో ‘రంగోలి రాష్ట్రం’ కార్యక్రమం ఉషశ్రీ శతజయంతికి సహకరిస్తాం డాక్టర్ జంధ్యాల, ఎం.సి. దాస్ తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్ మునిసిపల్ ఎన్నికల భద్రతపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాసేవలో ముందుంటుంది వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ వెంకట సూర్యప్రకాశరావు పెద్దల పండుగకు హిందూ స్మశాన వాటికలో ప్రత్యేక శుభ్రత 25 మంది సిబ్బందితో మూడు రోజులుగా పారిశుద్ధ్య పనులు అంగన్వాడీ కార్యకర్తలకు బిజెపి మహిళ మోర్చా సన్మానం పూల సింగిడి.. బతుకమ్మ సందడి! రెండున్నర ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైళ్ల స్టాపేజీలు నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమాజానికి బీసీలే వెన్నుముక.

కావలి గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హి సేవా' – విద్యార్థులకు చెత్త సేకరణపై అవగాహన.

Select Suryaa Now
కావలి గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హి సేవా' – విద్యార్థులకు చెత్త సేకరణపై అవగాహన.

​కావలి మేజర్ న్యూస్ :  పట్టణ పరిధిలోని ముసునూరు 15వ వార్డులోని బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం 'స్వచ్ఛత హి సేవా' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ పద్ధతులపై విద్యార్థులకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక అవగాహన కల్పించారు.  ​ఈ సందర్భంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. బషీర్ మాట్లాడుతూ, చెత్తను ఇంట్లోనే వర్గీకరించి వేర్వేరుగా అందించడం వల్ల వ్యర్థాల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు 'నాలుగు బుట్టల చెత్త సేకరణ' విధానంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కోరుతూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.  ​అనంతరం పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పాఠశాల విద్యార్థినులతో కలిసి వీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.  ​ఈ కార్యక్రమంలో వార్డు శానిటేషన్ సెక్రటరీ స్వర్ణ, శానిటరీ మేస్త్రీలు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.