BREAKING
తుమ్మలపెంటలో ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ... సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్ మా గ్రామంలో బాల్యవివాహాలు జరగవు - తీర్మానం చేసిన గ్రామసభలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది నెల్లూరు రూరల్ అభివృద్దే మా లక్ష్యం మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా వర్ధంతి పరిశ్రమల పేరుతో రైతుల కడుపు కొట్టవద్దు: కావలి రైతు సంఘం. శ్రీ నికేతన్ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు గోదాదేవి అమ్మవారికి వెండి కవచం బహుకరణ పునీత్ గ్రానైట్ ఫ్యాక్టరీలో విషాదం.. నీటి గుంటలో పడి కార్మికుడు మృతి కావలి గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హి సేవా' – విద్యార్థులకు చెత్త సేకరణపై అవగాహన. రఘురామ కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన

రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి - జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి.రాములు

Select Suryaa Now
రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి - జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి.రాములు
సూర్య, బెల్లంపల్లి/మంచిర్యాల జిల్లా ప్రతినిధి :జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను తహసిల్దార్ కృష్ణ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మాట్లాడుతూ ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఎంపిక చేసిన గ్రామాలలో రీ-సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రీ-సర్వే పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. పనులను మరింత వేగవంతంగా, నిబంధనల ప్రకారం, ఖచ్చితత్వంతో పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రీ-సర్వే కార్యక్రమానికి గ్రామ రైతులు సహకరిస్తున్నారని, ఇదే విధంగా అధికారులు, సిబ్బందికి సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, సర్వేయర్ వసంతరావ్, జి.పి.ఓ. శివకుమార్, చైన్ మెన్ రమేష్, మాజీ ఎంపీటీసీ మహేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.