రఘురామ కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు మండలం నెన్నూరు పంచాయతీ పరిధిలోని రఘురామ రొయ్యల వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ కారణంగా ఏర్పడుతున్న కాలుష్యంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్వర్ణ నెన్నూరు కార్యాలయం ఎదుట ఆందోళన అనంతరం కార్యదర్శికి వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ పరిశ్రమ కాలుష్యంపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్లినట్లు తెలిపారు. అయితే కాలుష్య నియంత్రణలో ఎటువంటి పురోగతి లేదని దీంతో పరిశ్రమ ఉన్న గ్రామంతోపాటు చుట్టూ ఉన్న గ్రామాల్లోనూ వాయు కాలుష్యంతో భరించలేని విధంగా ఉందని వాపోయారు. వింత వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆందోళనకు గ్రాయంలోని యువత బుజ్జా ఏడుకొండలు, నాశిన ఏడుకొండలు, బుజ్జా రఘురామయ్య, వినోద్‌కుమార్, దాసరి శ్రీనివాసులు, నాశిన వంశీకృష్ణల ఆద్వర్యంలో కలిసి ఇకనైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకుని కాలుష్యం బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు.