BREAKING
రూ.36 కోట్ల వార్షిక వేతనంతో భారత్‌లోనే అత్యధిక జీతం పొందే బ్యాంక్ సీఈవోగా అనుప్ బాగ్చి.. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి, సోమవారం ఢిల్లీలో భారీ ధర్నాకు సిద్ధమైన టీకాంగ్రెస్ నల్లగొండలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ జిల్లాలో యథేచ్ఛగా బాణాసంచా వ్యాపారం నిబంధనలకు తూట్లు పొడుస్తూ నడుస్తున్న వ్యాపారాలు పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపాను హెచ్చరికలు: ఐఎండీ జాబితా విడుదల.. అప్రమత్తంగా ఉండాలని సూచన! ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక అవుశాపూర్‌ సర్వీస్‌ రోడ్డుకు సోలార్‌ వెలుగులు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు ఏనుగు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి. పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు నూతన యాపిల్ సీఈవో టెర్నస్‌తో పనితీరుపై స్పందించిన టిమ్ కుక్: "నేను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.. ఆయన శైలి ఆయనదే"! రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.. మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి. బ్రిటన్ జూలో పులుల ఎన్‌క్లోజర్‌లో భారీ ప్రమాదం, పార్క్ మూసివేత ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఎస్ ఐ మల్లు. సంజీవరెడ్డి

రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన

Select Suryaa Now
 రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన

సూర్య స్థానిక & విశేషాల డెస్క్: తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటించనున్నారు. రాజమండ్రి జీఎస్‌ఎల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన "సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్" ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

అక్టోబర్ 11న ఉదయం 10:35 గంటలకు మెగాస్టార్ చిరంజీవి ఈ హెల్త్ కేర్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ప్రజలను, అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత, రాయితీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెగాస్టార్ రాక సందర్భంగా కపిలేశ్వరపురంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.