BREAKING
జిల్లాలో యథేచ్ఛగా బాణాసంచా వ్యాపారం నిబంధనలకు తూట్లు పొడుస్తూ నడుస్తున్న వ్యాపారాలు పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుపాను హెచ్చరికలు: ఐఎండీ జాబితా విడుదల.. అప్రమత్తంగా ఉండాలని సూచన! ఎల్‌నినోపై పార హుషార్..అధికారులకు సీఎం హెచ్చరిక అవుశాపూర్‌ సర్వీస్‌ రోడ్డుకు సోలార్‌ వెలుగులు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు ఏనుగు సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి. పులి సంచారంతో గ్రామాల్లో కలకలం.. ప్రజల్లో ఆందోళన పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడిన వడ్డి రఘురామ్ నాయుడు నూతన యాపిల్ సీఈవో టెర్నస్‌తో పనితీరుపై స్పందించిన టిమ్ కుక్: "నేను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.. ఆయన శైలి ఆయనదే"! రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి.. మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి. బ్రిటన్ జూలో పులుల ఎన్‌క్లోజర్‌లో భారీ ప్రమాదం, పార్క్ మూసివేత ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఎస్ ఐ మల్లు. సంజీవరెడ్డి నేటి నుండి వాసవి లో ప్రారంభం కానున్న నవరాత్రులు బ్రాహ్మణపల్లిలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు పాలకొల్లును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం! నిమ్మల రామానాయుడు అంబర్‌పేటలో మా కుటుంబం ఓట్లే గల్లంతు! 1962 నుంచి నివసిస్తున్న ఇళ్ల చిరునామాలే ఓటర్ల జాబితాలో లేవు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఆర్‌ఎస్‌ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆవేదన

నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు

Select Suryaa Now
నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి ఏర్పాట్లు

నెల్లూరు, అర్బన్, క్రైమ్ , మేజర్ న్యూస్  :   అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం అందించేందుకు నెల్లూరు పోలీస్‌ గ్రౌండ్‌లో గల శ్రీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌ వద్ద క్లెయిమ్‌ జాబితాల పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ డా., అజితా వేజెండ్ల తెలియజేశారు.బాధితులు తమ క్లెయిమ్‌ బాండ్లు, సంబంధిత పత్రాలతో హాజరై పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.అక్టోబర్‌ 12వ తేదీ నుంచి నవంబర్‌ 17వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండలాల వారీగా బాధితుల క్లెయిమ్‌లను పరిశీలించనున్నారు.బాధితులు తమకు కేటాయించిన తేదీల్లోనే హాజరై ప్రక్రియను సజావుగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
మండలాల వారీగా పరిశీలన తేదీలు
అక్టోబర్‌ 12 నుంచి 22 వరకు: అక్టోబర్‌ 12న ముత్తుకూరు, 13న పాడేరు/పాడలకూరు, 14న కోవూరు, 15న బుచ్చిరెడ్డిపాలెం, 16న ఇందుకూరుపేట, 17న కొడవలూరు, విడవలూరు, 19న టి.పి. గూడూరు, అల్లూరు, దగదర్తి, 21న కలిగిరి, కొండాపురం, 22న దుత్తలూరు, జలదంకి, ఉదయగిరి, వరికుంటపాడు, సీతారామపురం మండలాల బాధితులకు పరిశీలన నిర్వహించనున్నారు.అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 7 వరకు: అక్టోబర్‌ 23, 24, 26, 27 తేదీల్లో నెల్లూరు టౌన్‌ పరిధి బాధితులకు, అక్టోబర్‌ 28 నుంచి 31 వరకు నెల్లూరు రూరల్‌ పరిధి బాధితులకు పరిశీలన చేపడతారు.నవంబర్‌ 2 నుంచి 4 వరకు కావలి, బోగోలు, వింజమూరు, నవంబర్‌ 5న ఆత్మకూరు, నవంబర్‌ 6న అనసంతసాగరం, మర్రిపాడు, సంగం, నవంబర్‌ 7న నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల బాధితులకు పరిశీలన నిర్వహించనున్నారు.నవంబర్‌ 9 నుంచి 17 వరకు: నవంబర్‌ 9న గూడూరు, 10న మనుబోలు, 11న చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, పెళ్లకూరు, డి.వి. సత్రం, 12న రాపూరు, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, 13న కలువాయి, చేజర్ల, వెంకటాచలం, 16న తడ, ఓజిలి, సైదాపురం, 17న ఇట్లూరు ప్రాంతాల బాధితులకు పరిశీలన నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.సంప్రదించాల్సిన అధికారులు: క్లెయిమ్‌ల పరిశీలనకు సంబంధించి సందేహాలుంటే ఏఎస్పీ ఎస్. శిరీషను 9247560212 నంబరులో, డీఎస్పీ ఎన్. కోటారెడ్డిని 8985717344 నంబరులో, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ జి. రాజశేఖర్‌ బాబును 9494647517 నంబరులో సంప్రదించవచ్చని,బాధితులు తమకు కేటాయించిన తేదీని ముందుగా నిర్ధారించుకుని, అవసరమైన పత్రాలతో హాజరై క్లెయిమ్‌ పరిశీలనను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సూచించారు.