బ్రాహ్మణపల్లిలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు
బ్రాహ్మణపల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
బ్రాహ్మణపల్లి లో రంగురంగుల పూలతో బతుకమ్మల పేర్పు..
ఆటపాటలతో మహిళల సందడి.
ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు.వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
పూల సౌందర్యంతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది.మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై బతుకమ్మల చుట్టూ వలయాకారంగా తిరుగుతూ పాటలు పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు, సంస్కృతి పరిరక్షణకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు గ్రామంలో ఆనందోత్సాహాలను నింపాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
- ఎడ్ల వెంకటేష్ గౌడ్, తుర్కయంజాల్, మేజర్ న్యూస్.