BREAKING
*మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి* హైదరాబాద్‌లో మైనర్ బాలిక అక్రమ రవాణా కేసు: 24 గంటల్లో 8 మంది అరెస్ట్ స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు - మేయర్ పదవులకు 35.29%..జడ్పీ చైర్మన్‌కు 23.08% శాతం -రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం నియోజకవర్గం ఎన్నికల కమిటీ 'నిర్వాహక్' గా అచ్యుతరావు! సందీప్ కిషన్ 'కరికాల'లో కేథరిన్ థ్రెసా... అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో వెల్కమ్ చెప్పిన మేకర్స్ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు... టీమ్‌కు శుభాకాంక్షలు జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్ నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. ! శ్రీకృష్ణ నామస్మరణతో... మార్మోగిన నాగరగూడ

నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి.

Select Suryaa Now
నల్లబెల్లి మాజీ సర్పంచ్ గుండెపోటుతో మృతి.

మాజీ సర్పంచ్ పూనెం బాపనయ్య గుండెపోటుతో మృతి.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్):

మండల పరిధిలోని చిన్న నల్లబల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూనెం బాపనయ్య శనివారం గుండెపోటు తో అకస్మాత్తుగా మృతి చెందారు.ఆయన మరణ వార్తతో చిన్న నల్లబల్లి గ్రామంలో విషాద శాయలు అలుముకున్నాయి.గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో బాపనయ్య గ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని స్థానిక నాయకులు కొనియాడారు.సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా గ్రామంలో ఎటువంటి గొడవలు,తగాదాలు వచ్చినా బాపనయ్య గారే ముందుండి పెద్దరికం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పి ఎవరికీ నష్టం జరగకుండా ఎన్నో కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి ఆదర్శవంతమైన తీర్పులు చెప్పేవారని గ్రామ పెద్ద దిక్కుగా ఉండి అందరినీ కలుపుకెళ్లే ఆయన నాయకత్వాన్ని కోల్పోవడం గ్రామానికి తీరని లోటని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.పూనెం బాపనయ్య మృతి పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.నేడు చిన్ననల్లబల్లి కాలనీ వారి స్వగృహంలో అంత్యక్రియలు జరుగుతాయి.

దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్ సుమన్.