BREAKING
పెద్దపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఎనిమిది మంది అరెస్టు.. రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం

స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు - మేయర్ పదవులకు 35.29%..జడ్పీ చైర్మన్‌కు 23.08% శాతం -రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు - మేయర్ పదవులకు 35.29%..జడ్పీ చైర్మన్‌కు 23.08% శాతం  -రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్లపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ రాజేష్ రంజన్ నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 9 కేటగిరీల్లో రిజర్వేషన్ల శాతం ఖరారైంది. అత్యధికంగా మేయర్ పదవుల్లో 35.29 శాతం, అత్యల్పంగా జడ్పీ చైర్మన్ పదవుల్లో 23.08 శాతం బీసీ రిజర్వేషన్లు ఉండనున్నాయి.

జనాభా ప్రాతిపదికన, సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా ఈ లెక్కింపు చేశామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం వెలువడటంతో త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

విభాగాల వారీగా వివరాలు ఇలా

మేయర్ పదవులు - 35.29 శాతం

మున్సిపల్ చైర్మన్లు - 33.02 శాతం

అర్బన్ వార్డులు - 32.78 శాతం

సర్పంచ్ స్థానాలు - 27.95 శాతం

పంచాయతీ వార్డులు - 26.73 శాతం

ఎంపీటీసీలు - 25.55 శాతం

ఎంపీపీలు - 24.60 శాతం

జడ్పీటీసీలు - 24.60 శాతం 

జడ్పీ చైర్మన్లు - 23.08 శాతం

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి