నియోజకవర్గం ఎన్నికల కమిటీ 'నిర్వాహక్' గా అచ్యుతరావు!
ఎస్.రాయవరం,పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ "నిర్వాహక్" గా ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారానికి చెందిన సియ్యాదుల అచ్యుత కుమార్ తో కలిపి 32 మందికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నియోజకవర్గ స్థాయి స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించింది. కమిటీ నిర్వాహక దళ్ గా 32 పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అచ్యుత కుమార్ కు తొలి స్థానం దక్కింది.జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి , మాజీ మంత్రి,అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు గెడ్డం బుజ్జి, బోడపాటి శివదత్, తోట నగేష్ లకు అచ్యుత కుమార్ కృతజ్ఞతాభినందనాలు తెలియజేసారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలియజేస్తున్నానని అచ్యుత కుమార్ వెల్లడించారు.