సందీప్ కిషన్ 'కరికాల'లో కేథరిన్ థ్రెసా... అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో వెల్కమ్ చెప్పిన మేకర్స్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వర్సటైల్ నటుడు సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'కరికాల' చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంబాల లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కాంబినేషన్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో సందీప్ కిషన్ సరసన కథానాయికగా గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ నటించనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కేథరిన్ కు స్వాగతం పలుకుతూ ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
సందీప్ కిషన్, కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ వెండితెరపై మొదటిసారిగా జంటగా నటిస్తుండటంతో ఈ జోడీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కేథరిన్ గతంలో ఎన్నడూ చూడని ఒక విలక్షణమైన, విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, కాన్సెప్ట్ లు ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచగా, తాజాగా కేథరిన్ ఎంట్రీతో చిత్రానికి మరింత మైలేజ్ లభించింది. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పాత్ర కథా గమనంలో చాలా కీలకమని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారు. మొదటి చాప్టర్ ను 2027 జూలై 2న, రెండో చాప్టర్ ను 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ తో పాటు ప్రతిఒక్కరినీ ఆకట్టుకునే గ్రిప్పింగ్ నరేషన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారతీయ ప్రేక్షకులకు ఒక సరికొత్త సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ అహోరాత్రులు శ్రమిస్తోంది.
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో పాటు టాప్ నాచ్ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న కరికాల చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లోనే అతిపెద్ద మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ పై అన్ని భాషల్లోనూ మంచి బిజినెస్ క్రేజ్ నెలకొంది.Also Read: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు... టీమ్‌కు శుభాకాంక్షలు